ఈనెల 9న వేరుశనగ బహిరంగ వేలం

ఈనెల 9న వేరుశనగ బహిరంగ వేలం

NLG: గుండ్లపల్లి(డిండి) లోని వ్యవసాయ విత్తన ఉత్పత్తి కేంద్రంలో 2024-25 సంవత్సరం, యాసంగిలో పండించిన 78.8 క్వింటాళ్ల వేరుశనగ పంటను ఈనెల 9న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఏవో వెంకన్న శుక్రవారం తెలిపారు. వేరుశనగ పంట ప్రస్తుతం ఆమనగల్ కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్లు తెలిపారు. ఉ. 11 గంటలకు వేలం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనాలని కోరారు.