నూతన DCC అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు
MLG: జిల్లా DCC అధ్యక్షుడిగా రెండవసారి నియమితులైన పైడాకుల అశోకును సోమవారం సాయంత్రం కొత్తగూడ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనను శాలువతో సత్కరించి పూల మొక్క అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.