బీచ్ రోడ్డులో డ్రోన్‌తో నిఘా

VSP: నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ బీచ్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటకులు సముద్రంలో స్నానానికి దిగవద్దని సూచించారు. నోవాటెల్, ఆర్కే బీచ్, భీమిలి,పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో షీ-టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు.