నెల్లిమర్లలో అస్తవ్యస్తంగా చెత్త నిర్వహణ

VZM: నగరంలో గాంధీ నగర్ కాలనీ రోడ్డులో అస్తవ్యస్తంగా చెత్త నిండిపోయింది. మొయిద జంక్షన్ నుంచి గాంధీ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డులో డంపింగ్ చెత్త టిన్ నిండి, మిగిలిన చెత్త రోడ్డుపై చెల్లా చెదురుగా పడవేయడంతో ఆవులు, పందులు వాటిని రోడ్డు అంతా కంగాళీ చేశాయి. ఈచెత్త వలన దుర్గంధం వెదజల్లుతుందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే మున్సిపల్ చెత్తను తొలిగించాలని కోరుతున్నారు