ఎక్స్‌రే గదిని ప్రారంభించిన DCHS
KDP: పేదలకు మెరుగైన వైద్య చికిత్స సేవలు అందే విధంగా సిద్ధవటంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎక్స్‌రే గదిని కడప DCHS హిమదేవి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు, ఆపరేషన్ల కొరకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆపరేషన్ గదిని కూడా కేటాయించామన్నారు. పేషంట్ల వైద్య పరీక్షల నిమిత్తం ఎక్స్‌రే గదిని ప్రారంభించామన్నారు.