రూ.100 కోట్లతో మంచు విష్ణు బిగ్ ప్లాన్!

'కన్నప్ప' సినిమా తర్వాత మంచు విష్ణు మరో కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినీ రంగంలో మైక్రోడ్రామాలతో మిరాకిల్ చేయబోతున్నారట. 3-7 నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ను మైక్రోడ్రామాలు అని అంటారు. ఇందుకోసం విష్ణు రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.