VIDEO: గ్రామ పాలనకు పంచాయతీరాజ్‌ బలం: వెంకటేశ్వర్లు

VIDEO: గ్రామ పాలనకు పంచాయతీరాజ్‌ బలం: వెంకటేశ్వర్లు

GNTR: ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఏప్రిల్‌ 24న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీరాజ్‌ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.