ఏప్రిల్ ఒకటి నుంచి ఇసుక వాహనం సరఫరా
SRCL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల (ఏప్రిల్) ఒకటో తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా అవుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ సమావేశమయ్యారు.