యాంటీ డ్రగ్స్‌పై అవగాహన

SKLM: టెక్కలి మండల కేంద్రంలోని వంశధార కాలనీలో గల ఎస్‌టీ బాలుర వసతి గృహంలో శక్తి టీం ఆధ్వర్యంలో పోక్సో చట్టం, మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులకు టెక్కలి ఎస్సై రఘునాథరావు వివరించారు. విద్యార్థులు నేరాలకు దూరంగా ఉండాలని టీం ఇన్‌ఛార్జ్ గిరిధర్ అన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి పాల్గొన్నారు.