ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
HNK: మ్యూజికల్ గార్డెన్‌లో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతీక అని, సమాజంలో సౌహార్దం పెంపొందించడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయని తెలిపారు. ప్రజలందరూ ఆనందంగా, ఐక్యతతో జీవించాలని ఆకాంక్షించారు.