HCA కోశాధికారి పదవికి పోలింగ్

HCA కోశాధికారి పదవికి పోలింగ్

TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఇవాళ మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. కార్యదర్శి పదవికి ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం కాగా, కోశాధికారి పదవికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 174 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ.3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, సా. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.