మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్‌కు సన్మానం

మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్‌కు సన్మానం

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన భల్లా పల్లవిని మంగళవారం ఉదయం ఏపీ మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లవిని ఆయన సన్మానించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాయుడమ్మ, పరిమి చరణ్, చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.