VIDEO: చెన్నకేశవ స్వామి ఆలయానికి పొటెత్తిన భక్తులు
MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో దాసంగాలు వదిలారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.