ఈనెల 18న మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలు

ఈనెల 18న మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలు

సంగారెడ్డి పట్టణంలో మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈనెల 18వ తేదీన జరుగుతాయని CITU రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ అన్నారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మల్లేశం, సాయిలు, యాదగిరి పాల్గొన్నారు.