స్కూల్‌లో కానిస్టేబుల్ అసభ్యకర నృత్యాలు
కృష్ణా: కంకిపాడులో ఒక పోలీస్ కానిస్టేబుల్ మహిళతో కలిసి చిన్నారుల ఎదుట అసభ్యకర నృత్యాలు చేసిన ఘటన విమర్శలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్‌గా మారడంతో విస్తృతంగా విమర్శలు వెలువత్తుతున్నాయి. చిన్నారులు ఉన్నప్పటికీ శృంగార నృత్యాలు చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.