VIDEO: 'భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెన్నుపోటు'
ELR: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెన్నుపోటు పొడుస్తుందని ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి రమణ విమర్శించారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కూతురు వివాహ ఖర్చులకు రూ.40 వేలు ఇస్తామని, ఇప్పుడు రూ.20 వేలు ఇస్తామని జీవో విడుదల చేసిందన్నారు.