ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం
కోనసీమ: అమలాపురం ఆర్టీసీ డిపోలో ఇవాళ డ్రైవింగ్ కళాశాలలో ఎస్టీపీ రాఘవ కుమార్, కోనసీమ జిల్లా ప్రజా రవాణాధికారి ఆధ్వర్యంలో హైర్ బస్ డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు విచ్చేసి, డ్రైవర్లు కదిలే దేవుళ్ళని, వారు బస్సును నడుపుతున్నపుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలన్నారు.