'ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి'
MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును ప్రజలు నిర్భయంగా నియోగించుకోవాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ కోరారు. ఆదివారం జన్నారం మండలంలోని దేవునిగూడెం, కామన్ పల్లి గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 11న 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.