వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.. సీఎం ఆగ్రహం

వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.. సీఎం ఆగ్రహం

కృష్ణా: కైకలూరులో వంగవీటి మోహనరంగా విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి బుద్ధి చెప్పాలని సీఎం అన్నారు.