ఎయిర్ పోర్టులో 30 రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం

ఎయిర్ పోర్టులో 30 రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం

TG: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన వాచ్‌లను CISF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైలో షో కోసం తరలిస్తున్న 30 రోలెక్స్ వాచ్‌లను పట్టుకున్నారు. మొత్తం వాచ్‌ల విలువ రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాచ్‌లు తీసుకెళ్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.