బుల్లెట్ సురేశ్‌పై కేసు నమోదు
CTR: జిల్లాకు చెందిన కీలక నేత బుల్లెట్ సురేశ్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన తనను లైంగికంగా వేధించాడని, తుపాకీతో బెదిరించాడని ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో విడుదల చేసింది. ఇదే విషయమై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో బుల్లెట్ సురేశ్, ఆయన కుమారుడు అప్పు, భార్య భారతితో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వెల్లడించారు.