లారీ ఢీకొని వ్యక్తి మృతి

కోనసీమ: ఉప్పులగుప్తం మండలం ఉప్పలగుప్తం గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వానపల్లిపాలెంకి చెందిన వీర రాఘవులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్సీ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.