మామిడిపల్లిలో ఘనంగా ఉగాది వేడుకలు

మామిడిపల్లిలో ఘనంగా ఉగాది వేడుకలు

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లి పద్మశాలి సంఘం ఒకటో తర్పలో గురువారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సంవత్సరం అంతా ప్రజలకు మంచి జరగాలని భగవంతుడిని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నర్సయ్య, సెక్రటరీ భోగ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.