విస్తృత తనిఖీలు నిర్వహించాలి: జేసీ

విస్తృత తనిఖీలు నిర్వహించాలి: జేసీ

ప్రకాశం: లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ గురువారం ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎరువులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని చౌక దుకాణాలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జేసీ సమావేశంలో అధికారులకు సూచించారు.