ఎస్పీ మీనాను కలిసిన ఎమ్మెల్యే గిడ్డి
కోనసీమ: అమలాపురంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనాని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతలు, ప్రజా సమస్యలు, పోలీసు శాఖ చేపడుతున్న వివిధ సేవలపై ఎమ్మెల్యే ఎస్పీతో చర్చించారు.