జనసేనలో చేరిన ఎంపీటీసీ మేరీ రత్నం

W.G: నరసాపురం మండలం మల్లవరం ఎంపీటీసీ మేరీ రత్నం వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆదివారం నరసాపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఎంపీటీసీ మేరీరత్నంతో పాటు గ్రామంలోని పలువురు పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.