రేపు ప్యాపిలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

NDL: ప్యాపిలిలో రేపు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఆర్&బీ అతిథి గృహంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. మండల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆధార్ కార్డు జిరాక్స్ పాటు సమర్పించాలని తెలిపారు.