విషాదం.. రంగనాయకసాగర్‌లో ఇద్దరు గల్లంతు

TG: సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.