'గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి'
పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుతంగా ముగిశాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థవంతమైన బందోబస్తు, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం వల్ల ప్రజలు సురక్షితంగా ఓటు హక్కును వినియోగించారన్నారు. పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.