ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక శోభ: MLA

ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక శోభ: MLA

ADB: ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయ షెడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే స్థానిక నాయకులు కాలనీవాసులతో కలిసి బుధవారం భూమి పూజ చేశారు. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు.