నేడు ఎదురుమొండిలో ఎమ్మెల్యే పర్యటన
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇవాళ నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో రూ.నాలుగు కోట్లతో నూతన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎదురుమొండి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.