VIDEO: తప్పిన దిత్వా ముప్పు - ఊపిరి పీల్చుకున్న వరి రైతులు
VSP: దిత్వా తుఫాను ముప్పు తప్పడంతో వరి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయనుకునే తరుణంలో దిత్వా తుఫాను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. అనకాపల్లి జిల్లాలో తుఫాను ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో 22 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.