VIDEO: గోల్కొండ ఆసుపత్రిలో షూటింగ్.. రోగులు అసహనం

HYD: గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో షూటింగ్ జరపడంపై రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాధారణ ఓపీ సేవలు జరుగుతున్న సమయంలో షూటింగ్ యూనిట్ ఆసుపత్రిలోకి రావడంతో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల వైద్యం కోసం ఉన్నాయని, ఇలాంటి చోట్ల చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం సరికాదని రోగులు ఆరోపించారు.