రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై
కృష్ణా: నందివాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు ఎస్సై శ్రీనివాస్ ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.రౌడీషీటర్లు సామాజికంగా మార్పు చెందాలని,చట్టాల పట్ల గౌరవభావం కలిగి సత్వర మార్గంలో నడుచుకోవాలని సూచించారు.