'మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు వహించాలి'
MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామ నర్సరీని జిల్లా పీడీ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించి నర్సరీ అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు. ఎండల ప్రభావం వల్ల మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలన్నారు.