ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి: MPDO

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి: MPDO

GDWL: ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలని ఎంపీడీవో అజర్ మోహియుద్దీన్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రం శివారులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి, హాజరు పట్టికను తనిఖీ చేశారు. కూలీలు సమయపాలన పాటించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేశ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.