ఒంటిమిట్ట మండలానికి చేరిన పాఠ్య పుస్తకాలు

అన్నమయ్య: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్రలో భాగంగా గురువారం ఒంటిమిట్ట మండలానికి 10,000 పాఠ్య పుస్తకాలు చేరాయని ఒంటిమిట్ట ఎంఈవో జి. వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తామని ఎంఈవో పేర్కొన్నారు. ఆయన కూడా పాఠ్య పుస్తకాలను వేరు చేయడంలో పాల్గొన్నారు.