వైసీపీ గ్రామ కమిటీలకు శ్రీకారం
కృష్టా: వైసీపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని కైలే అనిల్ అన్నారు. బుధవారం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, ప్రజలతో నిత్యం మమేకం కావాలని సూచించారు. అనంతరం వెంట్రప్రగడ గ్రామ కమిటీని ప్రకటించారు.