భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
WGL: మార్గశిర మాసం శనివారం సందర్భంగా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంతమంతా కిటకిటలాడింది.