రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు.. స్థానికుల ఆందోళన
ASR: జీకే వీధి మండలం సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. రెండు రోజుల నుంచి బయట వ్యక్తులు కొండపైకి వస్తున్నారన్నారు. దీంతో మంగళవారం సాయంత్రం అధిక సంఖ్యలో స్థానికులు రంగురాళ్ల తవ్వకాలు జరుపుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. రంగురాళ్ల వ్యాపారులు, అటవీ సిబ్బంది ఏకమై తవ్వకాలు జరుపుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.