డిప్యూటీ ఎంపీడీవోకు ప్రశంసాపత్రం
VZM: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి మండల డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న డి.ఎస్.ఎన్. రత్న మాలికకు ప్రశంసాపత్రం లభించింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారి రోజా రాణి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా కిందిస్థాయి ఉద్యోగులు చేసిన సహాయ సహకారాలు మరువలేనివని ఆమె గుర్తు చేశారు.