'వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న మహిళలందరికీ శుభాకాంక్షలు'

NTR: అత్యంత పవిత్రమైన శ్రావణమాసం మూడవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న మహిళలందరికీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మూడవ శుక్రవారం సందర్భంగా ఈరోజు నందిగామలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ వారు ఆమెను సత్కరించారు. ఆమె వెంట కూటమి నేతలు పాల్గొన్నారు.