శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో జబర్దస్త్ టీం
KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంమైన వీరబ్రహ్మేంద్ర స్వామిని మంగళవారం జబర్దస్త్ కామెడీ షో యాక్టర్లు సద్దాం, నవ సందీప్, తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి వెంకటాద్రి స్వామిని దర్శించుకుని సన్మానించారు.