గుంటూరులో ఇంటర్ విద్యార్థిని మృతి

గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో శనివారం దారుణం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.