గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల
గుంటూరు: జిల్లాలో ఎయిడ్స్, టీబీ విభాగాల్లో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను DMHO విజయలక్ష్మి విడుదల చేశారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో DMHO కార్యాలయానికి హాజరుకావాలన్నారు. ఎంపిక జాబితా guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు.