సీపీఐ శాఖ కార్యదర్శి జనార్ధన్ మృతి
MNCL: మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్‌కు చెందిన CPI కార్యదర్శి జనార్దన్(58) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, AITUC నాయకులు మృతదేహాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. జనార్ధన్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తున్న పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు.