'20న సమ్మెను జయప్రదం చేయండి'

HNK: కార్మిక వర్గ చట్టల రక్షణకై 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల అధ్యక్షులు బొక్కల కుమారస్వామి అన్నారు. ఐనవోలు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ కార్మికులు ఎంపీడీవోకు సమ్మె నోటిస్ అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల అవలంభిస్తుందని అన్నారు.