BREAKING: 'ఇండియా' కూటమి అభ్యర్థి ఖరారు

ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా(I.N.D.I.A) కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పేరును కూటమి ఖరారు చేసింది. 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, అలాగే గోవాకు మొదటి లోకాయుక్తగా ఆయన సేవలందించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా ఎన్డీఏకు దీటైన పోటీ ఇవ్వాలని ఇండియా కూటమి భావిస్తోంది.