VIDEO: అడ్డాడలో విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్ల పంపిణీ
కృష్ణా: పామర్రు మండలం అడ్డాడలోని ZPH పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. పామర్రు MLA వర్ల కుమార్ రాజా పాల్గొని విద్యార్థులకు ప్యాడ్లు అందజేశారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి శ్రద్ధగా చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని MLA విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి సర్టిఫికెట్ ప్రాధాన్యతన వివరించారు.