గ్రంథాలయ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే

NLR: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ, శాసన మండలి సభ్యులతో 2025 - 26 సంవత్సరానికి గాను ఉభయ సభల సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో గ్రంథాలయ కమిటీ సభ్యుడిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ని నియమించారు, దీంతో నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.